రైతులకు గుడ్ న్యూస్.. వ్యవసాయ ఉత్పాదకత పెంపొందించేందుకు కొత్త రకం విత్తనాలను ప్రధాని మోదీ ఆదివారం ఆగస్టు 11, 2024 విడుదల చేశారు. న్యూఢిల్లీలో ఇండియన్ అగ్రికర్చరల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ లో మొత్తం 109 రకాల కొత్తరకం విత్తనాలను శాస్త్రవేత్తలు, రైతులతో కలిసి మోదీ విడుదల చేశారు. అధిక దిగుబడి, ప్రస్తుత వాతావరణ పరిస్థితులను తట్టుకునే వంగడాలు, బయోఫోర్టిఫైర్టిడ్ రకాల విత్తనాలను తయారీ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలలో ఇదొక ముందడుగు అని ప్రధాని మోదీ అన్నారు.
IARIలో జరిగిన విత్తనాల విడుదల కార్యక్రమంలో శాస్త్రవేత్లు, రైతులతో సంభాషించారు ప్రధాని మోదీ. కొత్త రకం విత్తనాల ప్రాముఖ్యతను తెలిపారు. ఈ ఆవిష్క రణలు వ్యవసాయంలో కీలక ప్రభావం చూపుతాయన్నారు. పోషకాహార ఎంపికల వైపు దేశ ప్రజలు మళ్లుతున్నారు.. మిల్లెట్లకు పెరుగుతున్న ప్రాధాన్యతతను మోదీ గుర్తు చేశారు. సహజ వ్యవసాయం ప్రయోజనాలు, సేంద్రీయ వ్యవసాయ పద్దతులపై సాధారణ ప్రజల్లో ఆరోగ్య పరమైన విశ్వాసం పెరుగుతుందన్నారు.
ప్రధాని విడుదల చేసిన 109 రకాల విత్తనాల్లో 34 క్షేత్ర విత్తనాలు, 27 ఉద్యానవన పంటలకు సంబంధించిన విత్తనాలు ఉన్నారు. క్షేత్ర పంటల విత్తనాలలో మిను ములు, మేత పంటలు, నూనెగింజలు, పప్పు ధాన్యాలు, చెరకు, పత్తి, ఇతర తృణధాన్యాలు ఉన్నాయి. ఉద్యానవన పంట్లో వివిధ రకాల పండ్లు, కూరగాయలు, తోటల పంటలు, దుంప పంటలు, సుగంధద్రవ్యాలు, పువ్వులు, ఔషద మొక్కలు ఉన్నాయి.
ఈ ఆవిష్కరణ ప్రయోజనాలు వీలైనంత ఎక్కువ మంది రైతులకు చేరేలా , ఈ కొత్త రకం విత్తనాల ప్రయోజనాలను నెలవారీగా రైతులకు తెలియజేయాలని కృషి విజ్ణాన కేంద్రాలను ప్రధాని మోదీ కోరారు. సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో ప్రభుత్వం చేస్తున్న కృషికి కృషి విజ్ణాన కేంద్రాలు ఇస్తున్న సహకారాన్ని ప్రధాని మోదీ ప్రశంసించారు. కొత్త రకం విత్తనాలను అభివృద్ది చేయడంలో శాస్త్రవేత్తల పాత్రను కూడా ప్రధాని మోదీ ప్రశింసించారు.
సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు రాబోయే రెండేళ్లలో దేశవ్యాప్తంగా కోటి మంది రైతులను సహజ వ్యవసాయంలోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ప్రధాని మోదీ అన్నారు. ఈ వ్యూహంలో భాగంగా సర్టిఫికేషన్, బ్రాండింగ్ సపోర్టును రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించనుంది. పప్పు ధాన్యాలు, నూనె గింజలలో స్వయం సమృద్ధి సాధించడానికి ప్రభుత్వం వాటి ఉత్పత్తి, నిల్వలను , మార్కెటింగ్ ను బలోపేత చేయాలని యోచిస్తున్నట్టు ప్రధాని మోదీ చెప్పారు.