పాలేరులో తపాలా ఉద్యోగుల వంటావార్పు

కూసుమంచి, వెలుగు : కూసుమంచి మండలంలో పాలేరు సబ్​ పోస్టు ఆఫీస్​ వద్ద బుధవారం తపాలా ఉద్యోగుల నిరవధిక సమ్మెలో భాగంగా రెండవ రోజు వంటావార్పు చేసి నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు సివిల్ సర్వెంట్ హోదా కల్పించాలని, కమలేశ్ చంద్ర కమిటీని అమలు చేయాలని, ఇంక్రిమెంట్స్ 12, 24, 36 సర్వీస్ పూర్తి చేసిన వారికి  ఆర్థిక ఉన్నతి కల్పించాలని కోరారు.