చిన్నచింతకుంట, వెలుగు: కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామి వారికి ముక్కర వంశ రాజులు చేయించిన ఆభరణాలను అలంకరించనున్నారు. మండలంలోని అమ్మాపురం గ్రామ సమీపంలో వెలిసిన కురుమూర్తి స్వామికి కాంచన గుహలో బంగారు మణులు, రత్నాలతో కూడిన ఆభరణాలను ధరింపజేస్తారు.
ఆత్మకూరు ఎస్బీఐ నుంచి ఉదయం స్వామివారి ఆభరణాలు ఊరేగింపుగా కొత్తపల్లి, దుప్పల్లి మీదుగా అమలాపురం సంస్థాన అధ్యక్షుడు రాజా శ్రీరామ్ భూపాల్ నివాసానికి చేరుకుంటాయి. అనంతరం సంస్థానాధీశుడైన రాజ శ్రీరామ భూపాల్ ఆభరణాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అక్కడి నుంచి కురుమూర్తి ఆలయానికి ఊరేగింపుగా తీసుకొస్తారు. అర్చకులు స్వామివారిని బంగారు ఆభరణాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేస్తారు.