సరళ్ యాప్..ఈ నెంబర్ కు 6359119119 మిస్డ్ కాల్ ఇవ్వండి : బీజేపీ 

సరళ్ యాప్..ఈ నెంబర్ కు 6359119119 మిస్డ్ కాల్ ఇవ్వండి : బీజేపీ 

బీజేపీ బూత్ కార్యకర్తల సమ్మేళనానికి సర్వం సిద్ధమైంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్టా శనివారం వర్చువల్ విదానంలో బూత్ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం తెలంగాణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన సరళ్ యాప్ లాంఛ్ చేయనున్నారు. ఈ యాప్ ద్వారా కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. బీజేపీ కార్యక్రమాలకు మద్దతు తెలపాలనుకునే వారు 6359119119 మిస్డ్ కాల్ ఇవ్వాలని బీజేపీ కోరింది.

బీజేపీ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఎల్ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించనుంది. బీజేపీ "పాలక్" లు ఆయా నియోజకవర్గాల్లో నిర్విహించే కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. వారిని ఉద్దేశించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర కార్యాలయం నుంచి ప్రసంగించనున్నారు. మిషన్ 90లో భాగంగా సంస్థాగత నిర్మాణంపై బీజేపీ దృష్టి సారించింది. ఫిబ్రవరి మెదటి వారంలోగా 34,600 బూత్ కమిటీలను నియమించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది.