
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సురక్ష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేషెంట్లకు పండ్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్‌పర్సన్లు, పోలీస్, వైద్యారోగ్య శాఖ అధికారులు పాల్గొని రక్తదానం చేసిన వారికి ప్రశంసా పత్రాలు అందించారు.
అంతకుముందు జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీలు తీశారు. సిద్దిపేటలో సీపీ శ్వేత ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు పోలీస్ అధికారులకు మెడల్స్ అందజేశారు. - నెట్‌వర్క్, వెలుగు