
- తనిఖీల్లో దొరికింది రూ.286 కోట్లు
- అందులో నగల విలువే రూ.149 కోట్లు
హైదరాబాద్, వెలుగు : ఎన్నికల కోడ్ అమలులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తనిఖీల్లో పెద్ద మొత్తంలో నగదు, బంగారం, మద్యం పట్టుబడుతున్నాయి. ఈ నెల 9 నుంచి ఇప్పటిదాకా జరిగిన తనిఖీల్లో పట్టుబడిన వాటి మొత్తం విలువ రూ.286.74 కోట్లు దాటింది. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు రూ.8 కోట్లకుపైగా నగదు, 38 కిలోల బంగారం, 189 కిలోల వెండి, 186 క్యారెట్ల వజ్రాలు, ఐదు గ్రాముల ప్లాటినం, ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు సీఈవో ఆఫీస్ వెల్లడించింది.
వీటి విలువ రూ.28.73 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఇప్పటిదాకా రూ.96 కోట్ల నగదు పట్టుబడగా, సీజ్ చేసిన బంగారం విలువ రూ.149.14 కోట్లు ఉన్నట్లు అంచనా. రూ.12 కోట్ల విలువైన మద్యం, రూ.9 కోట్ల విలువైన డ్రగ్స్, రూ.19 కోట్ల విలువైన గిఫ్టులను పట్టుకున్నట్లు తెలిపింది.