దేశవ్యాప్తంగా పార్లమెంట్ లోక్ సభ ఎన్నికల హడావిడి మొదలైంది. విమర్శల అస్త్రాలు, పార్టీల్లోకి జంపింగ్ జపాంగ్ కు ఊపందుకున్నాయి. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మార్చి 6న తుక్కుగూడలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనుంది. ఈ పార్టీకి ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ హాజరవుతారట.
బహిరంగ సభకు రాష్ట్ర వ్యాప్తంగా భారీగా జనసమీకరణ చేయాలని ఇఫ్పటికే పార్టీ నేతకు పీసీసీ ఆదేశాలు పంపిందని సమాచారం. ఈ సభకు 10లక్షల మందిని పోగు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచనణలో ఉంది. అన్ని పార్లమెంట్లకు, మంత్రులకు, ముఖ్య నేతలకు ఇంఛార్జి బాధ్యతలు అప్పగించారు. రేపు పార్లమెంట్ ఇంఛార్జి నేతలంతా తమ పరిధిలోని ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహించాలని పీసీసీ ఆదేశించింది.
ALSO READ :- ఢిల్లీ లిక్కర్ స్కామ్ : కవిత బెయిల్ పిటిషన్ వాయిదా