రెండో విడత లబ్ధిదారులకు అనారోగ్యపు గొర్రెలు

వచ్చిన రోజే ఓ గొర్రె మృతి

సారంగాపూర్, వెలుగు : రెండో విడత గొర్రెల పంపిణిలో భాగంగా గొల్లకుర్మలకు అనారోగ్యపు గొర్రెలను పంపిణీ చేస్తున్నారు. గుంటూరు నుంచి తీసుకొచ్చిన గొర్రెలను సారంగాపూర్​మండలంలోని బోరిగాం గ్రామంలోని లబ్ధిదారులకు మంగళవారం అందజేశారు. మొత్తం 16 యూనిట్లు పంపిణీ చేయగా ఓ గొర్రె అక్కడే చనిపోయింది. మరో ఆరేడు గొర్రెలు తీవ్ర అనారోగ్యంతో ఉన్నాయి. లబ్ధిదారులు ఈ విషయాన్ని పశువైద్యాధికారి దృష్టికి తీసుకెళ్లారు.

ALSO READ :రైతుల గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్, బీజేపీకి లేదు : ఎమ్మెల్యే రేఖా నాయక్

అయితే, చనిపోయిన గొర్రెకు బీమా వర్తిస్తుందని, మిగతావి కొద్ది రోజుల్లోనే కోలుకుంటాయని సర్దిజెప్పే ప్రయత్నం చేసినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. ఇప్పటికే పలు గ్రామాల్లోని లబ్ధిదారులు అనారోగ్యంతో ఉన్న గొర్రెలను తిరస్కరిస్తున్నప్పటికీ సంబంధిత పశుసంవర్ధక శాఖ అధికారులు మాత్రం అదే జిల్లా గొర్రెలను పంపిణీ  చేస్తున్నారు.