బెల్లంపల్లిలో 3.66 లక్షలు పట్టివేత

బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి పట్టణంలో వాహనాల తనిఖీల్లో భాగంగా పోలీసులు రూ.3 లక్షల 66 వేల నగదు పట్టుకున్నారు.  బెల్లంపల్లి టూటౌన్, తాళ్లగురిజాల పోలీసులు వివరాలు వెల్లడించారు. సోమవారం సాయంత్రం కాల్ టెక్స్ ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై ఎస్సై రమేశ్ ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీలు చేస్తుండగా.. కారులో బెల్లంపల్లికి చెందిన నవీన్ అనే వ్యక్తి వద్ద రూ.2 లక్షల10వేల 500, భీమినికి చెందిన మరో వ్యక్తి వద్ద రూ.50వేల 500 ల నగదు పట్టుకున్నట్లు తెలిపారు.

బెల్లంపల్లి మండలంలోని లంబడి తండా గురకుల పాఠశాల ప్రధాన రహదారి వద్ద కన్నెపల్లికి చెందిన రాజు అనే వ్యక్తి వద్ద రూ.లక్షా 5వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన రూ.3లక్షల66వేల నగదును ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి ఎల్తూరి సురేఖకు అందజేసినట్లు తెలిపారు.   

చింతలమానేపల్లిలో లక్షా 50వేలు

కాగజ్​నగర్: సిర్పూర్ టీ పొలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద బండ సమీపంలో చింతలమానేపల్లి ఎస్ఐ వెంకటేశ్ అధ్వర్యంలో చేపట్టిన తనిఖీల్లో కౌతాల నుంచి కాగజ్ నగర్​కు బైక్​పై వెళ్తున్న కుంచాల శివ కుమార్ అనే వ్యక్తి వద్ద రూ.లక్షా 40 వేల పట్టుకున్నారు. సరైన ఆధారాలు లేకపోవడంతో సీజ్ చేసినట్లు ఎస్ఐ వెంకటేశ్ తెలిపారు.