- బ్లాక్లో డబుల్ రేట్లు
జైనూర్, వెలుగు: ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు 28 నుంచి బంద్ చేయవల్సిన వైన్ షాప్ లను ఒక రోజు ముందే బంద్ చేశారు. సోమవారం జైనూర్, సిర్పూర్ (యు) మండలాల్లోని వైన్ షాపులను నిర్వాహకులు క్లోజ్ చేసి ఉంచారు. దీన్ని అవకాశంగా తీసుకున్న కొందరు బెల్ట్ షాప్ నిర్వాహకులు గుట్టుచప్పుడు కాకుండా డబుల్ రేట్లకు మద్యాన్ని విక్రయించారు.
ఒక రోజు ముందే వైన్సులు బంద్ చేయడంపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. స్టాక్ ను రహస్యం డంప్ చేసి, బ్లాక్ లో అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారని, ఓట్ల కోసం పంపిణీ చేయడానికి ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారని చర్చించుకున్నారు.