
విశాఖపట్నం : టీమిండియా ఆల్‌రౌండర్ హనుమ విహారి.. ఆంధ్ర జట్టుతోనే కొనసాగనున్నాడు. కొత్త ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అతను ఆంధ్ర టీమ్‌కే ఆడనున్నాడు. గత ప్రభుత్వం హయాంలో ఆంధ్ర క్రికెట్ సంఘంలోని కొందరు తనను ఇబ్బంది పెట్టి, కెప్టెన్సీ నుంచి తప్పించడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన విహారి.. ఇంకెప్పుడూ ఆంధ్రకు ఆడబోనని ప్రకటించాడు.
ఆత్మాభిమానం దెబ్బతిన్నదని చెప్పాడు. ఆంధ్ర టీమ్ను వదిలేసేందుకు ఎన్‌ఓసీ కూడా తీసుకున్నాడు. ఇంతలోనే స్టేట్ గవర్నమెంట్‌లో మార్పు జరగడంతో విహారి మనసు మార్చుకున్నాడు. మంగళవారం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్‌తో సమావేశమైన విహారి తాను ఆంధ్ర టీమ్‌తోనే కొనసాగుతానని తెలిపాడు.