నీటిని వృధా చేస్తే రూ.5వేల జరిమానా..ఎక్కడంటే..

నీటిని వృధా చేస్తే రూ.5వేల జరిమానా..ఎక్కడంటే..

వేసవి కాలం  రాకముందే ఎండలు దంచి కొడుతున్నాయి..రోజువారీ ఉష్ణగ్రతల కంటే అదనంగా 2నుంచి 4 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో కొన్ని చోట్ల అప్పుడు మంచినీటి కొరత ఏర్పడుతోంది. ముఖ్యంగా మహానగరాల్లో తాగునీటి కోసం ప్రజలు రోడ్డెక్కాల్సిన దుస్థితి. సిలికాన్ వ్యాలీ అయిన బెంగళూరులో వేసవి రాకముందే మండే ఎండలతో నీటికోసం ప్రజలు అల్లాడిపోతున్నారు. బెంగళూరు వాసుల తాగు నీటి సమస్యను తీర్చేందుకు బెంగళూరు వాటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. 

నీటిని వృధా చేస్తే చర్యలు తప్పవని బెంగళూరు వాటర్ బోర్డు హెచ్చరించింది.  నీటి వృధాను అడ్డుకునేందుకు కొత్త రూల్స్ పెట్టింది. కార్ వాషింగ్, గార్డెనింగ్, డెకరేటివ్ ఫౌంటెన్లు వంటి అనవసరమైన వాటికి, మాల్స్, సినిమా హాళ్లలో కూడా తాగునీటిని ఉపయోగించకూడదని వార్నింగ్ ఇచ్చింది.. ఇలా చేస్తే రూ. 5వేల జరిమానా విధించనున్నట్లు తెలిపింది. 

రూల్స్ అతిక్రమించడం రీపీట్ చేస్తే ప్రతీ సారీ మరో 500లు పెంచుతామని హెచ్చరించింది. ఎవరైనా నీటిని వృధా చేసినట్లు కనిపిస్తే వెంటనే 1916కి డయల్ చేసి బోర్డుకు తెలియజేయాలని, నీటివరుల పరిరక్షణలో ప్రజలు చురుకైనా పాత్ర పోషించాలని బెంగళూరు జలమండలి కోరింది. 

బెంగళూరులో వేసవి కాలంకంటే సాధారణ నెలల్లో కూడా నీటి సమస్య ఉంటుంది.. ఇక ఎండాకాలం వచ్చింది నీటి సమస్య మరింత తీవ్రతరం అవుతుంది.  బెంగళూరులో 300 నుంచి 500 మిలియన్ లీటర్లు నీటి కొరతను ఎదుర్కొంటుందని బెంగళూరు వాటర్ బోర్డు లెక్కలు చెబుతున్నారు. రాబోయే నెలల్లో నీటి సంక్షోభం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) నిపుణులు హెచ్చరించారు. 

బెంగళూరు నగరానికి తాగునీటి సోర్స్ కావేరీ నది.. రోజుకు దాదాపు 1450 మిలియన్ లీటర్ల నీటిని కావేరీ నది నుంచి బెంగళూరు నగరానికి తరలిస్తుంటారు. అదనంగా భూగర్భ జలాల ద్వారా 700 మిలియన్ లీటర్ల నీరు బెంగళూరుసిటీకి అందుతుంది. 

సాధారణ రోజుల్లోనే నీటి కొరత ఎదుర్కొనే బెంగళరు సిటీలో ఎండా కాలం వస్తే నీటి కొరత మరింత తీవ్రతరం అవుతుంది..జాగ్రత్తగా నీటిని వాడుకోవాలి. ముఖ్యంగా తాగునీటిని అనవసర కార్యక్రమాలకు వాడకూడదు.. వాడితో కఠిన చర్యలతోపాటు.. 5వేలకు పైగా జరిమాని ఉంటుందని సిటీ వాసులను బెంగళూరు వాటర్ బోర్డు హెచ్చరించింది.