సమ్మర్ సీజన్ సమీపిస్తుండడంతో చల్లదనం కోసం జనం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పాత కూలర్లు, ఏసీలకు రిపేర్లు చేయిస్తుండగా, కొత్తవాటిని కొనుగోలు చేసేందుకు రెడీ అవుతున్నారు. మరోవైపు చల్లని నీరు తాగేందుకు రంజన్లు, కుండలు కొనేందుకు జనం ఆసక్తి చూపుతున్నారు. పుచ్చకాయ, తర్భూజ కాయల దుకాణాలు కూడా వెలిశాయి. కరీంనగర్ లో ఆయా దుకాణాల వద్ద వీటిని కొనుగోలు చేసేందుకు వచ్చినవారితో సందడి నెలకొంది.
- వెలుగు ఫొటోగ్రాఫర్, కరీంనగర్