
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: ప్రజావాణి కార్యక్రమానికి కలెక్టర్ రాకపోవడంతో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారులు కలెక్టరేట్ ఆవరణలోనే వేచి ఉండాల్సి వచ్చింది. వీరిలో ధరణి సమస్యలతో బాధపడుతున్న రైతులే ఎక్కువగా కలెక్టర్ రాక కోసం ఎదురుచూశారు. అడిషనల్ కలెక్టర్ సెలవులో ఉండడంతో అప్లికేషన్లు తీసుకునేందుకు ఎవరూ లేక గంటల తరబడి క్యూ లైన్ లో ఉండిపోయారు. 4 వారాలుగా కలెక్టర్ ప్రజావాణికి రాకపోవడంతో ధరణి సమస్యలపై దరఖాస్తు ఇచ్చేందుకు వచ్చిన రైతులు తిరిగి వెళ్లిపోయారు. చివరికి ప్లానింగ్ ఆఫీసర్ భూపాల్ రెడ్డి ఫిర్యాదులను స్వీకరించారు.