న్యూఢిల్లీ : లగ్జరీ ప్రొడక్టులు సహా అన్ని రిటెయిల్ కేటగిరీలలోనూ రాబోయే ఆరు నెలల్లో ఖర్చు తగ్గించుకుంటామని దేశంలోని మూడింట రెండొంతుల మంది చెబుతున్నారు. కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా పెరిగినందువల్లే ఇలా ఆలోచిస్టున్నట్లు కన్జూమర్లు ఒక సర్వేలో వెల్లడించారు. దేశంలోని టైర్1, టైర్ 2 సిటీలు కలిపి 9,180 మందిపై పీడబ్ల్యూసీ ఈ సర్వే నిర్వహించింది. ఇందులో 500 మందిని ఇంటర్వ్యూ చేశామని సంస్థ పేర్కొంది. లగ్జరీ ప్రొడక్టులు కొనడం ఆపేస్తామని సర్వేలో 38 శాతం మంది చెప్పినట్లు వివరించింది. ఆన్లైన్ యాక్టివిటీస్, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్‌పై ఖర్చు తగ్గిస్తామని 32 శాతం మంది, దుస్తులు, ఫుట్‌వేర్ వంటి ఫ్యాషన్ ప్రొడక్టులపై ఖర్చు తగ్గించుకుంటామని 31 శాతం మంది కన్జూమర్లు వెల్లడించినట్లు సర్వే రిపోర్టు పేర్కొంది.
ట్రావెల్, గ్రోసరీల ఖర్చు తగ్గిస్తామని వరసగా 30 శాతం, 21 శాతం మంది కన్జూమర్లు చెప్పినట్లు పేర్కొంది. 2022 లో ఎకానమీ బలంగా ఉందని, 2023 సెకండ్ క్వార్టర్ నుంచి ఈ గ్రోత్ స్లో అవుతున్నట్లు కనిపిస్తోందని కూడా కన్జూమర్లు అభిప్రాయపడుతున్నట్లు పీడబ్ల్యూసీ రిపోర్టు వెల్లడించింది. వ్యక్తిగత ఫైనాన్షియల్ సిట్యుయేషన్‌పై కొంత ఆందోళన ఉందని ఈ సర్వేలో 74 శాతం మంది రెస్పాండెంట్లు పేర్కొన్నారు. పర్సనల్ ఫైనాన్స్‌పై ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ తగ్గించుకునేందుకు ఖర్చు తగ్గించుకోవాలని చాలా మంది కన్జూమర్లు ప్లాన్ చేసుకుంటున్నారు.
ఉచిత ఆఫర్లు, డిస్కౌంట్లు ఇచ్చే రిటెయిలర్ల దగ్గరే షాపింగ్ చేస్తామని ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 47 శాతం మంది వెల్లడించారు. ఏదైనా ప్రమోషన్, లేదా స్పెషల్ ఆఫర్లు ఉంటేనే ప్రొడక్టులను కొంటామని 45 శాతం మంది , షాపింగ్ చేసేప్పుడు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య రేట్ల పెరుగుదలేనని సగం మంది కన్జూమర్లు చెబుతున్నారు.