
కొండపాక(కొమురవెల్లి ), వెలుగు : జీపీ కార్మికులు సమ్మెలో ఉండడంతో గ్రామ సర్పంచ్ పారిశుధ్య కార్మికుడి అవతారం ఎత్తారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ సర్పంచ్ ఆరెపల్లి మహదేవ్ గౌడ్ సోమవారం చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలించారు. జీపీ కార్మికుల సమ్మెతో కొద్ది రోజులుగా గ్రామంలో చెత్త సేకరణ నిలిచిపోయింది. ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోవడం, వర్షాకాలంలో గ్రామంలో వ్యాధులు ప్రబలకుండా ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తూ చెత్తను సేకరించి తరలించారు. సర్పంను పలువురు అభినంధించారు.