టమాటో కిలో రూ. 79కే ఇవ్వాలంటూ ప్రభుత్వ ఆదేశాలు

చెన్నై: నిత్యావసరాలకు తోడు.. కూరగాయల ధరలు భారీగా పెరగడంతో సామాన్యులు విలవిలాడిపోతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దిగుబడి తగ్గడంతో ధరలు అమాంతం పెరిగాయి. కూరగాయల ధరలు విపరీతంగా పెరగడంతో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టమాటో ధర బహిరంగ మార్కెట్లో రూ. 150 పలుకుతుండటంతో వినియోగదారులు ఆవైపు చూడాలంటేనే భయపడతున్నారు. దాంతో ప్రజలకు కాస్త ఊరటనిచ్చే దిశగా సీఎం స్టాలిన్ ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చింది. టమాటో కిలో రూ. 79కే ఇవ్వాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. అందుకోసం ప్రభుత్వ దుకాణాలను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఆ దుకాణాల్లో టమాటోలను సబ్సిడీ కింద పంపిణీ చేయాలని తెలిపారు.