నిజామాబాద్ పర్యటనలో భాగంగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో తాము కూడా ప్రత్యామ్నాయమేనని అన్నారు. వచ్చే ఎన్నికల్లో మోజార్టీ స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పారు. అయితే ఎక్కడెక్కడ పోటీ చేస్తామనేది ఎన్నికల ముందు జాబితాను ప్రకటిస్తామన్నారు.
భోధన్ లో కూడా పోటీ చేస్తామని చెప్పిన ఒవైసీ... భోధన్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్‌కు ఎన్నికల్లో తగిన బుద్ది చేప్తామని అన్నారు. ఎంఐఎం కౌన్సిలర్స్, నేతలపై అక్రమ కేసులు పెట్టారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్, డీజీపీ దృష్టికి తీసుకువెళ్తాం. అరెస్ట్ అయిన ఎంఐఎం నేతలు.. ఎమ్మెల్సీ కవిత, షకీల్ గెలుపు కోసం పనిచేశారని అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాయమని చెప్పారు.
రాష్ట్రంలో కూడా పేద ముస్లింలు కూడా ఎక్కువగానే ఉన్నారన్న ఒవైసీ.. వారికి కూడా ముస్లిం బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తే ఎలాంటి స్పందన రాలేదన్నారు. ఇక మసీదులు తొలగించి సచివాలయం నిర్మించారు. కూల్చిన ఆ మసీదులను వెంటనే కట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
ALSO READ:భూ తగాదాలతో ..ముగ్గురు మృతి
పాట్నా మీటింగ్ కు తనని ప్రతిపక్ష పార్టీలు పిలవలేదన్న ఒవైసీ.. 2024 లో మోడీని ఓడించేందుకు తాము వ్యక్తిగతంగా శాయశక్తులా ప్రయత్నం చేస్తామని వెల్లడించారు.