
పహల్గాంపై దాడి చేసి.. 26 మంది ప్రాణాలను తీసిన టెర్రరిస్టు కుక్కలను చంపేయాలని.. ఇండియా నుంచి ఏరిపారేయాలన్నారు ఎంఐఎం పార్టీ చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. ఉగ్రవాదం అంతం చేయటానికి మోదీ ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయానికి అయినా.. భేషరతుగా మద్దతు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు ఓవైసీ. జాతీయ ప్రయోజనాల కోసం.. ఇండియా భవిష్యత్ కోసం ప్రధానమంత్రి మోదీ తీసుకునే ఓ నిర్ణయానికి అయినా మద్దతు ఉంటుందని వెల్లడించారు ఓవైసీ.
భారతదేశాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన సమయం ఇది.. భద్రత విషయంలో రాజీ లేదన్నారు. కాశ్మీర్ ప్రజల రక్షణ కోసం మోదీ ప్రభుత్వం తీసుకునే అన్ని చర్యలకు ఎంఐఎం పార్టీ అండగా ఉంటుందన్నారు అసదుద్దీన్ ఓవైసీ. మన మధ్య ఎన్ని విబేధాలు అయినా ఉండొచ్చు.. వాటి అన్నింటినీ తర్వాత చూసుకుందాం.. ఇలాంటి కీలకమైన సమయంలో ఐక్యంగా ఉండాలని కోరారు ఓవైసీ.
పాకిస్తాన్ తో సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడాన్ని స్వాగతించిన ఆయన.. ఈ విషయాన్ని రాజకీయం చేయకూడదన్నారు. టెర్రరిస్టులను పెంచిపోషిస్తు్న్న.. ఆశ్రయం కల్పిస్తున్న పాకిస్తాన్ దేశంపై చర్యలు తీసుకోవాలని.. ఇందులో ఏ విధంగా రాజీ పడేది లేదన్నారు ఓవైసీ.
పాక్ ఆక్రమణలో ఉన్న కాశ్మీర్ భాగాన్ని తిరిగి తెచ్చుకోవాలని.. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను స్వాధీనం చేసుకునే సమయం ఆసన్నమైందని.. ఆత్మ రక్షణ కోసం ముందుకు వెళ్లే సమయం ఇదేనని.. అంతర్జాతీయ చట్టం కూడా ఇదే చెబుతుందన్నారు అసదుద్దీన్ ఓవైసీ. పాకిస్తాన్ పై ఆంక్షలు విధిస్తూ.. సైనిక దాడి ద్వారా పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను తిరిగి స్వాధీనం చేసుకోవాలంటూ మోదీ ప్రభుత్వాన్ని కోరారు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ.
AIMIM पार्टी कश्मीरियों की हिफ़ाज़त के लिए उठाए गए हर कदम में सरकार के साथ है :- Barrister @asadowaisi #AIMIM #pahalgamattack #PahalgamTerroristAttack #Pahalgam #AsaduddinOwaisi #TerroristAttack #owaisi pic.twitter.com/y7lmhsxbVW
— AIMIM (@aimim_national) April 25, 2025
రాజకీయాలకు అతీతంగా దేశం అంతా ఐక్యంగా ఉండాల్సిన సమయం అని.. ఇందులో ఎలాంటి బేషజాలకు పోవాల్సిన అవసరం లేదన్నారు ఓవైసీ.