బిలియనీర్, ప్రముఖ వ్యాపార వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీపై ఎంఐఎం చీప్ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వక్ఫ్ బోర్డుకు చెందిన భూమిలో ముఖేష్ అంబానీ నివాసం యాంటిలియా ను నిర్మించారని ఆరోపించారు.
ఓ ఇంటర్వూలో అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు సవరణ చట్టం 2024పై తన అభిప్రాయాలు చెప్పారు. సంస్కరణల పేరుతో వక్ఫ్ బోర్డులను అంతం చేయాలని చూస్తున్నారని ప్రధాని మోదీ ప్రభుత్వంపై మండిపడ్డారు. సంస్కరణ బిల్లు ఓ నిబంధన ద్వారా వక్ఫ్ భూమిని బోర్డునుంచి లాక్కోవాలని చూస్తున్నారని అన్నారు.
ALSO READ : 10 రోజుల్లో రాజీనామా చెయ్..లేదా చంపేస్తాం..సీఎం యోగి ఆదిత్యానాథ్కు బెదిరింపు కాల్స్
వక్ఫ్ ఆస్తుల పేరుతో ముస్లిం కమ్యూనిటీ భూములను ఆక్రమిస్తున్నారని వస్తున్న ఆరోపణలపై ఎంఐఎం చీఫ్ స్పందిస్తూ.. అది బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ చేస్తు ప్రచారమని అన్నారు.
ఆంటిలియాపై అసదుద్దీన్ ఒవైసీ..
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తన నివాసం అయిన ఆంటిలియాను వక్ఫ్ బోర్డు భూముల్లో నిర్మించారని అసుదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. దీనిపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తోందన్నారు. ముఖేష్ అంబాని ఇల్లు ఆంటిలియా వక్ఫ్ ఆస్తి అని అన్నారు.
వక్ఫ్ చట్ట సవరణ బిల్లు..
ఇటీవల బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వం వక్ఫ్ చట్టసవరణ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది. రాష్ట్ర వక్ఫ్ బోర్డులు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడం లక్ష్యంగా ఈ బిల్లును తెచ్చారు. రిజిష్ట్రేషన్ ప్రక్రియ, వక్ఫ్ స్థలాల సర్వే చేయడం, ఆక్రమణలను గుర్తించి అడ్డుకోవడం. అయితే వక్ప్ బోర్డుల అధికారాలు పరిమితం చేయడమే లక్ష్యంగా చట్టసవరణకు చేస్తోందని ముస్లిం నేతలు వాదన.
- వక్ఫ్-అలాల్-ఔలాద్ పరిస్థితుల్లో ముస్లిం మహిళలకు వారసత్వ హక్కులను పొందడం ఈ సవరణ లక్ష్యం.
- 'వినియోగదారు ద్వారా వక్ఫ్'కు సంబంధించిన సెక్షన్లను తొలగించాలని బిల్లు ప్రతిపాదిస్తోంది.
- ఆస్తులను వక్ఫ్ లేదా ప్రభుత్వ నియంత్రణలో వర్గీకరించే అధికారం జిల్లా కలెక్టర్‌కు ఇవ్వబడింది.
- ఆస్తి వర్గీకరణకు సంబంధించి జిల్లా కలెక్టర్ నిర్ణయమే అంతిమంగా పరిగణించబడుతుంది.
- ఈ వర్గీకరణలకు సంబంధించిన వివాదాలను తగిన హైకోర్టులు పరిష్కరించగలవు.
బిల్లుపై వివాదం
- వక్ఫ్ చట్టం సవరణ బిల్లు ప్రస్తుతం భారతదేశంలో చర్చలో ఉంది, భారత పార్టీ నుండి గణనీయమైన వ్యతిరేకత ఉంది.
- బిల్లు కారణంగా ముస్లిం వర్గాలను ప్రభావితం చేసే అవకాశం ఉన్న భూ కబ్జా గురించి ఆందోళనలు తలెత్తాయి.
- అదే ముస్లిం వర్గాల దీర్ఘకాల అభ్యర్థనను బిల్లు పరిష్కరిస్తున్నట్లు అధికార ఎన్‌డిఎ వాదిస్తోంది.
- బిల్లు ప్రస్తుతం జాయింట్ పార్లమెంటరీ కమిటీ పరిశీలనలో ఉంది.
- జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఫలితాలు డిసెంబర్‌లో వెల్లడి కానున్నాయి.