హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై దాడి జరిగింది. ఢిల్లీలోని ఒవైసీ ఇంటిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారు. సాయంత్రం 5.30 గంటల సమయంలో దుండగులు ఈ ఘటనకు పాల్పడ్డారు. దీనిపై ఒవైసీ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దాడిలో తన ఇంటి అద్దాలు ద్వంసం అయినట్లుగా ఒవైసీ పోలీసులకు తెలిపారు. 2014 నుంచి ఇప్పటివరకు తన ఇంటిపై నాలుగు సార్లు దాడి జరిగిందని ఒవైసీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఒవైసీ పోలీసులను కోరారు. సమాచారం అందుకున్న ఢిల్లీ అదనపు డీసీపీ నేతృత్వంలోని పోలీసుల బృందం ఆయన నివాసానికి వెళ్లి నుంచి ఆధారాలు సేకరించింది. దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.