మహిళపై అఘాయిత్యం కేసులో ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూకి గాంధీనగర్ సెషన్స్ కోర్ట్ జీవిత ఖైదు విధించింది. దీంతో పాటు రూ.50 వేల జరిమానా విధించింది.
2001 నుంచి 2006 వరకు పలు సార్లు తనపై అఘాయిత్యానికి పాల్పడినట్లు సూరత్ కు చెందిన ఓ మహిళ 2013లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు ఆశారాం బాపూతో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేశారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన గాంధీ నగర్ సెషన్స్ కోర్ట్.. సరైన సాక్ష్యాలు లేనందున ఆశారం బాపూ భార్యతో పాటు మిగతా వారిని సోమవారం నిర్దోషులుగా ప్రకటించింది. ఆశారం బాపూని దోషిగా నిర్దారించింంది. ఈ నేపథ్యంలో ఇవాళ జీవిత ఖైదు విధించింది. ఇప్పటికే ఆశారం బాపూ ఓ మైనర్ బాలికపై అఘాయిత్యం కేసులో దోషిగా తేలారు. ఈ కేసులోను ఆయన జీవిత ఖైదు అనుభవిస్తున్నారు.