గత బుధవారం అంతరిక్షంలో ఇస్రో శాస్త్రవేత్తలు సుమారు 300 కిలోమీటర్లు ఎత్తులో ఉన్న ఓ ఉపగ్రహాన్ని యాంటీ శాటిలైట్ మిస్సైల్‌తో పేల్చేశారు. ఐతే ఈ ప్రయోగ పరీక్ష పెద్ద ప్రమాదంగా మారిందని అమెరికాకు చెందిన నాసా తెలిపింది. యాంటీ శాటిలైట్‌తో ఉపగ్రహాన్ని పేల్చడంతో సుమారు 400 వ్యర్ధాలు తయారైనట్లు నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది. ఈ వ్యర్ధాలతో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ISS)కు తీవ్ర ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని, భవిష్యత్‌లో అంతరిక్షంలోకి మానవులను తీసుకెళ్లే ప్రయోగాలను నిర్వహించలేమని నాసా హెచ్చరించింది. ఇప్పటివరకు పది సెంటీమీటర్ల సైజు కన్నా పెద్దగా ఉన్న వ్యర్ధాలను మాత్రమే ట్రాక్ చేస్తున్నామని నాసా తెలిపింది. ఐతే ప్రతి వ్యర్థాన్ని లెక్కగట్టడం సులువు కాదని నాసాకు చెందిన జిమ్ బ్రిడెన్స్టయిన్ తెలిపారు. ప్రస్తుతం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ తిరుగుతున్న కక్ష్య కన్నా దిగువ కక్ష్యలోనే భారత్ ఓ శాటిలైట్‌ను పేల్చింది. ఉపగ్రహాలు ఆ కక్ష్య కన్నా పైనే తిరుగుతున్నాయి. సుమారు 24 వ్యర్ధాలు స్పేస్ స్టేషన్ ఎగువ కక్ష్యలో పేరుకుపోయినట్లు కూడా నాసా చెప్పింది. సుమారు 24 వ్యర్థాలు స్పేస్ స్టేషన్ కన్నా ఎగువ కక్ష్యలో పేరుకపోయినట్లు నాసా తెలిపింది. 2007లో చైనా నిర్వహించిన యాంటి శాటిలైట్ పరీక్షతో సుమారు మూడు వేల వ్యర్థాలు ఉత్పన్నమైనట్లు నాసా చెప్పింది. తాజాగా భారత్ నిర్వహించిన పరీక్ష కారణంగా స్పేస్ స్టేషన్‌కు ప్రమాదం జరిగే అవకాశాలు మరింత పెరిగాయన్నారు. అంటే పది రోజుల్లో ఈ వ్యర్ధాల వల్ల సుమారు 44 సార్లు స్పేస్ స్టేషన్‌కు ప్రమాదం సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. వ్యర్ధాలు భూవాతావరణంలోకి ప్రవేశించి మండిపోయే కొద్దీ ఈ ముప్పు తగ్గిపోతుందని స్పష్టం చేశారు.
ASAT వ్యర్ధాలతో ISS కు ముప్పు: నాసా
- టెక్నాలజి
- April 2, 2019
మరిన్ని వార్తలు
-
హెజ్బొల్లా గ్రూప్‌తో కాల్పుల విరమణ షురూ.. 14 నెలల పోరాటానికి ఇజ్రాయెల్ ముగింపు
-
ఇస్కాన్ మత ఛాందసవాద గ్రూప్!.. బంగ్లాదేశ్ సుప్రీంకోర్టులోఆ దేశ ప్రభుత్వం అఫిడవిట్
-
జపాన్ లో ఓ వ్యక్తి వింత హాబీ.. స్ట్రెస్ రిలీఫ్ కోసమని..1000 ఇండ్లలోకి చొరబడ్డడు!
-
Black Friday:బ్లాక్ ఫ్రైడే.. బ్లాక్ ఫ్రైడే సేల్స్ గురించి బాగా వినపడుతోంది.. ఇంతకీ బ్లాక్ ఫ్రైడే అంటే..?
లేటెస్ట్
- Bachhala Malli Movie Teaser: ఆకట్టుకుంటున్న అల్లరి నరేష్ బచ్చలమల్లి టీజర్.. నాకు నచ్చినట్లు బ్రతుకుతా..
- కేబీఆర్ పార్క్ వద్ద కొత్త వెలుగులు..డెకరేటివ్ పవర్ పోల్స్ ప్రారంభం..
- అదానీ లంచం కేసుతో నాకెలాంటి సంబంధం లేదు.. పరువు నష్టం దావా వేస్తా:ఏపీ మాజీ సీఎం జగన్
- హైదరాబాద్‌లో ఇక్కడ బిర్యానీ తిన్నారా..? ‘బొద్దింక వస్తే మేం ఏం చేస్తాం’.. అంటున్నరుగా..!
- Pushpa 2 Censor Certificate: పుష్ప2కి సెన్సార్ కట్స్.. ఈ పదాలు థియేటర్లో వినపడవ్..!
- మాలల్లో ఐక్యత వచ్చింది.. సింహ గర్జన విజయవంతం చేయాలె: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
- SA vs SL: గంటలోపే ముగిసింది: సౌతాఫ్రికా పేసర్ల విశ్వరూపం.. 42 పరుగులకే శ్రీలంక ఆలౌట్
- Credit Score: హార్డ్ ఎంక్వయిరీస్..మీ క్రెడిట్ స్కోర్‌ను తగ్గిస్తున్నాయా? ఏంచేయాలంటే..
- డ్రగ్స్ బారినపడిన వాళ్ళు ఈ నెంబర్ కి కాల్ చెయ్యండంటూ అల్లు అర్జున్ వీడియో...
- ఫుల్ మెజార్టీ ఉన్నా.. సీఎం ఎంపికలో జాప్యం ఎందుకు?: సంజయ్ రౌత్
Most Read News
- OTT Telugu Movies: ఇవాళ (Nov28) ఓటీటీకి వచ్చిన రెండు బ్లాక్‌బస్టర్ తెలుగు సినిమాలు.. ఎక్కడ చూడాలంటే?
- గృహప్రవేశం చేసిన రోజే ఇల్లు దగ్ధం
- సుబ్బరాజు భార్య ఎవరో, ఏంటో తెలిసింది.. స్రవంతి బ్యాక్‌గ్రౌండ్ ఇదే..
- Nagarjuna: కొత్త కారు కొన్న హీరో నాగార్జున.. ధర ఎంతో తెలిస్తే అవాక్కవుతారు..!
- Release Movies: (Nov28) థియేటర్/ ఓటీటీలో రిలీజైన సినిమాలు, వెబ్ సిరీస్‌లు
- సన్నొడ్ల రేట్లు పైపైకి: సర్కారు బోనస్‌తో ధరపెంచుతున్న వ్యాపారులు, మిల్లర్లు
- మామునూర్ ఎయిర్పోర్ట్ భూముల్లో.. ఇదే ఆఖరు పంట
- చదువుకోకుండా ఏం పనులు ఇవి.. ఖమ్మం హాస్టల్లో ఏం చేశారో చూడండి..
- Syed Mushtaq Ali Trophy: చెన్నైకి వస్తే చెలరేగుతారు: పాండ్య బౌలింగ్‌లో విజయ్ శంకర్ విధ్వంసం
- గేమ్ ఛేంజర్ లో జగదేకవీరుడు అతిలోక సుందరి పోజ్.. సూపర్ అంటున్న చెర్రీ ఫ్యాన్స్..