
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ కూకట్‌పల్లిలోని ప్రాజెక్ట్‌ను లాంచ్ చేసిన మొదటి రోజే రూ.500 కోట్ల విలువైన అమ్మకాలను రియల్ ఎస్టేట్ కంపెనీ ఏఎస్‌బీఎల్ సాధించింది. ఏఎస్‌బీఎల్ ల్యాండ్‌మార్క్ ప్రాజెక్ట్ మొత్తం 6.6 ఎకరాల్లో విస్తరించి ఉంది. 3, 3.5, 4 బీహెచ్‌కే అపార్ట్‌మెంట్లను కడుతున్నారు. పట్టణాల్లోని కుటుంబాల అవసరాలను తీర్చే విధంగా ఏఎస్‌బీఎల్ ల్యాండ్‌మార్క్‌ను డిజైన్ చేశామని కంపెనీ సీఈఓ కొరుపోలు అజితేష్ అన్నారు. హై క్వాలిటీ ఇండ్లను నిర్మించడానికి కట్టుబడి ఉన్నామనే విషయం ఈ ప్రాజెక్ట్ ద్వారా తెలుస్తోందని చెప్పారు. ఏఎస్‌బీఎల్ టర్నోవర్ 2022 లో రూ.1,250 కోట్లను దాటగా, కిందటేడాది రూ.2,200 కోట్లను టచ్ చేసింది.