
ప్రాంతీయ భద్రత ద్వారా జాతీయ భద్రతను లేదా జాతీయ భద్రత ద్వారా ప్రాంతీయ భద్రతను సాధించేందుకు ఆగ్నేయాసియా దేశాల సంస్థ (ఆసియాన్)ను 1967, ఆగస్టు 8న బ్యాంకాక్‌లో స్థాపించారు. ఇది ఆర్థిక, సాంఘిక, సాంస్కృతికపరమైన సహకార సంస్థ. దీని ప్రధాన కార్యాలయం ఇండోనేసియా రాజధాని జకార్తాలో ఉంది. ప్రతి ఏడాది ఆగస్టు 8న ఆసియా దినోత్సవంగా జరుపుకుంటారు.
వ్యవస్థాపక దేశాలైన ఇండోనేసియా, మలేసియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్ దేశాలు ఆసియాన్ స్థాపనకు ఉద్దేశించిన పత్రంపై సంతకం చేశాయి. ఈ పత్రాన్ని ఆసియా ప్రకటనగా వ్యవహరిస్తారు. ప్రస్తుత సెక్రటరీ జనరల్ కావో కిం హార్న్( కంబోడియా). ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఏకగ్రీవంగా 2006, డిసెంబర్ 4న ఆసియాన్‌కు పరిశీలక హోదాను ఇచ్చారు.
ఆశయాలు
1. ఆగ్నేయాసియా ప్రాంతంలో ఆర్థిక వృద్ధి, సామాజిక ప్రగతి, సాంస్కృతిక అభివృద్ధిని వేగవంతం చేయడం
2. ఆగ్నేయాసియా ప్రాంతంలో శాంతి, సుస్థిరతలను, సమన్యాయపాలనను సాధించడం.
3. ఐక్యరాజ్యసమితి ప్రవేశికలోని సూత్రాలకు కట్టుబడి ఉండటం.
ప్రధాన సూత్రాలు
1. సభ్యరాజ్యాల స్వాతంత్ర్యం, సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత, జాతీయ ప్రతిపత్తి పట్ల పరస్పర గౌరవం కలిగి ఉండటం.
2. ప్రతి రాజ్యం బహిర్గత ఒత్తిడులు, సార్వభౌమత్వం, నిర్బంధాలు ఏవీ లేకుండా స్వతంత్రంగా మనుగడను సాగించే హక్కును కలిగి ఉండటం.
3. సభ్యరాజ్యాల అంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం.
4. సభ్య రాజ్యాల మధ్య ఉత్పన్నమయ్యే సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవడం.
5. సభ్యరాజ్యాల మధ్య సహకార సంబంధాలను పెంపొందించుకోవడం.
ప్రధాన విభాగాలు
1. ఆసియాన్ రాజకీయ, భద్రత సంస్థ
2. ఆసియాన్ ఆర్థిక సమాజం
3. ఆసియాన్ సామాజిక, సాంస్కృతిక సమాజం
ప్రాంతీయ భద్రత: ప్రాంతీయ భద్రత కోసం ఆసియాన్ రీజనల్ ఫోరమ్‌ను 1994లో స్థాపించారు. ఇది ఆసియా పసిఫిక్ ప్రాంతానికి సంబంధించిన బహుళ పక్షాల మధ్య భద్రతాపరమైన అంశాలపై చర్చలు జరుపుతుంది. ఇందులో 27 సభ్య దేశాలు ఉన్నాయి. 2008, డిసెంబర్లో ఆసియాన్ చార్టర్ అమలులోకి వచ్చిన తర్వాత ఆసియాన్ సదస్సును ప్రతి రెండు సంవత్సరాలకు ఒక్కసారి జరపాలని నిర్ణయించారు.
37వ సమ్మిట్ కోవిడ్–19 కారణంగా 36, 37వ ఆసియాన్ శిఖరాగ్ర సదస్సులు ఆన్లైన్లో జరిగాయి. ఈ సమావేశాలకు వియత్నాం ఆతిథ్యం ఇచ్చింది.
ఆసియాన్ థీమ్: ఒకే దృష్టి, ఒకే ఏకత్వం,
ఒకే సమాజం
ఆసియాన్ జెండా: ఆసియాన్ చిహ్నం ఒక స్థిరమైన శాంతియుత, ఏకీకృత, డైనమిక్ ఆసియాన్‌ను సూచిస్తుంది. ఆసియాన్ చిహ్నం చుట్టూ వివిధ రంగులతో వక్రంతో కూడిన 10 అంశాలు 10 దేశాలను సూచిస్తాయి.
జెండాలో చూపించిన రంగులు: ఎరుపు, పసుపు, నీలం, తెలుపు.
ఎరుపు: ధైర్యం, చైతన్యం
పసుపు: సంపద
నీలం: శాంతి, స్థిరత్వం
తెలుపు: స్వచ్ఛత
2023 థీమ్: ASEAN Matters: Epicentrum of Growth.
ఆసియాన్ + 3: 1997లో ఆసియాన్ + 3 (చైనా, జపాన్, దక్షిణకొరియా) ఏర్పాటు. ఆసియాన్ దేశాలు, మూడు తూర్పు ఆసియా దేశాలు కలిసి ఆసియాన్ ప్లస్ 3గా ఏర్పడ్డాయి.
తూర్పు ఆసియా సదస్సు2005లో ప్రారంభమైంది.
2005లో (ఆసియాన్ + 3 )+3 (ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, భారత్)
2011లో (ఆసియాన్ + 3 )+3 +2 (అమెరికా, రష్యా)
హార్ట్ ఆసియా సదస్సు: 2011లో ప్రారంభించారు. మొత్తం సభ్య దేశాలు 15. అవి.. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, అజర్బైజాన్, చైనా, ఇండియా, ఇరాన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, రష్యా, సౌదీ అరేబియా, తజకిస్తాన్, టర్కీ, తుర్కిమినిస్తాన్, యూఏఈ, ఉజ్బెకిస్తాన్.
ఆసియాన్ సమ్మిట్స్ ఆప్ఘనిస్తాన్, దాని పొరుగు దేశాలు సురక్షితంగా, సుస్థిరంగా ఉండేందుకు ప్రాంతీయ భద్రత, సహకారం పెంపొందించడం.