తెలుగు చదవలేరు.. లెక్కలు చేయలేరు

తెలుగు చదవలేరు.. లెక్కలు చేయలేరు
  • ఆసర్ సర్వేలో వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని విద్యార్థుల నైపుణ్యాన్ని అంచనా వేసేందుకు చేపట్టిన యాన్యువల్  స్టేటస్  ఆఫ్  ఎడ్యుకేషన్  రిపోర్ట్ (ఆసర్)లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల్లోని  17, 997 గ్రామాల్లో సర్వే చేశారు. మన రాష్ట్రంలో 262 బడుల్లో సర్వే చేపట్టారు. సర్వే ప్రకా రం ఒకటో తరగతి పిల్లల్లో 30% మందికి తెలు గులో కనీసం ఒక్క అక్షరం కూడా చదివే స్థి తిలో లేరు. 8వ తరగతి పిల్లల్లో 1.6 శాతం మందిదీ అదే స్థితి. 

8వ తరగతి విద్యార్థుల్లో ఏడు శాతానికి పైగా అక్షరాలు గుర్తించడం లేదు. ఆ క్లాసు స్టూ డెంట్లు 22 శాతం మంది ఒకటో తరగతి పుస్తకాలు చదవట్లేదు. రెండో తరగతి పుస్తకాలను 56 శాతానికి పైగా విద్యా ర్థులు చదవడం లేదు. మూడో తరగతిలో 7.8 శాతం మంది కనీసం అక్షరాలు కూడా చదవ ట్లేదు. 26.5 % మంది విద్యార్థులు అక్షరాలు చదువుతున్నా.. పదాలు చదవలేకపోతున్నారు. లెక్కలూ సరిగా చేయలేకపోతున్నారు.  కనీసం అంకెలనూ గుర్తించట్లేదని రిపోర్టు తేల్చింది.