రాజేంద్ర నగర్‎లో యాష్ ఆయిల్ పట్టివేత.. మహిళ అరెస్ట్

రాజేంద్ర నగర్‎లో యాష్ ఆయిల్ పట్టివేత.. మహిళ అరెస్ట్

హైదరాబాద్: రాజేంద్రనగర్‎ పరిధిలోని బండ్లగూడలో నిషేధిత యాష్ ఆయిల్ పట్టుబడింది. 300 గ్రాముల యాష్ ఆయిల్‎ను టీఎస్ న్యాబ్ అధికారులు సీజ్ చేశారు. వివరాల ప్రకారం.. బండ్లగూడలో రహీమ్ ఉన్నీసా అనే మహిళ గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లోనే యాష్ ఆయిల్ విక్రయిస్తోంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న టీఎస్ న్యాబ్ అధికారులు.. గురువారం (అక్టోబర్ 31) రహీమ్ ఉన్నీసా నివాసంలో సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా చిన్న చిన్న బాటిల్స్‎లో యాష్ ఆయిల్‎ను పోలీసులు గుర్తించారు. విక్రయానికి రెడీగా ఉన్న యాష్ ఆయిల్ సీజ్ చేసి.. రహీమ్ ఉన్నీసాను అరెస్ట్ చేశారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

ALSO READ | ఒడిశా నుంచి హైదరాబాద్​కు గంజాయి..21 కేజీల గంజా సీజ్