కందనూలు, వెలుగు: నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌ను శుక్రవారం ఆశా కార్యకర్తలు ముట్టడించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీనివాసులు మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ఆశా కార్యకర్తలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలన్నారు.
ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఆశా కార్యకర్తలకు న్యాయం చేయకపోతే ప్రజాభవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు. పొదిల రామయ్య, చెన్నమ్మ, వసుంధర, కృష్ణవేణి, వరలక్ష్మి, జయమ్మ, శోభ, విజయనీల పాల్గొన్నారు.