- కలెక్టరేట్ ఎదుట ధర్నా
ఆసిఫాబాద్ ,వెలుగు : తమమాండ్లు, సమస్యలు పరిష్కారించాలని బుధవారం ఆశ కార్యకర్తలు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముంజం శ్రీనివాస్ మాట్లాడుతూ .. ఆశా వర్కర్లకు కనీస వేతనం 18000 చెల్లించాలన్నారు. కార్మికులకు గుర్తించి కార్మిక చట్టం పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు రాజేందర్, కమిటీ సభ్యులు వెలిశాల క్రిష్ణమాచారి, తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి, పద్మ, జిల్లా కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు భాగ్య, కేసర, పంచశీల, బద్రుబాయి, మొగ్ర, అనితా, అనురాధ, సాక్రుబాయి, ఓమల, శోభ, లక్ష్మీ, అరుణ, సరోజ, సురేఖ లు పాల్గొన్నారు.