
మెదక్ టౌన్/సిద్దిపేట టౌన్/నారాయణ్ ఖేడ్, వెలుగు: ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే తీర్చాలని పలువురు నాయకులు కోరారు. నారాయణఖేడ్‌లోని ఆర్డీవో ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్న ఆశా వర్కర్లకు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప సంఘీభావం ప్రకటించారు. సిద్దిపేటలోని బీజేఆర్ చౌరస్తా వద్ద నిరాహార దీక్ష చేస్తున్న ఆశాలకు ధర్మ సమాజ్ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు రవిబాబు మహారాజ్ మద్దతు తెలిపారు.
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సమ్మె చేస్తున్న ఆశాలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని సీఐటీయూ సిద్దిపేట జిల్లా కార్యదర్శి కాముని గోపాల్ స్వామి ఖండించారు. మెదక్ జిల్లా కేంద్రంలో ఆశా వర్కర్ల భిక్షాటన చేసి నిరసన తెలిపారు.