స్పిన్నర్ శోభన ఆశ ఐదు వికెట్లతో మ్యాజిక్ చేయడంతో డబ్ల్యూపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) చిన్న టార్గెట్‌ను కాపాడుకుంటూ బోణీ చేసింది. సొంతగడ్డపై శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 2 రన్స్ తేడాతో యూపీ వారియర్స్‌ను ఓడించింది. ఈ మ్యాచ్ లో 17వ ఓవర్లో మూడు వికెట్లు తీయడంతో మ్యాచ్ ను ఒక్కసారిగా ఆర్సీబీ వైపుకు మలుపు తిరిగింది. ఈ మ్యాచ్ లో తన నాలుగు ఓవర్ల స్పెల్ లో 22 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీసుకుంది. దీంతో ప్రస్తుతం నెటిజన్స్ ఈమె ఎవరని ఆరా తీస్తున్నారు.
ఆశా శోభన ఒక సామాన్య కుటుంబం నుండి వచ్చింది. ఆమె తండ్రి కేరళలో ఆటో రిక్షా డ్రైవర్. కేరళలోని తిరువనంతపురం ప్రాంతానికి చెందిన శోభనా.. దూరదర్శన్‌లో మాజీ బౌలర్ నీతూ డేవిడ్ అంతర్జాతీయ క్రికెట్ ఆడడాన్ని చూసి స్ఫూర్తి పొంది ప్రొఫెషనల్ క్రికెట్ కు రావాలని నిర్ణయించుకుంది. కాటన్ హిల్ గర్ల్స్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో చదువుతున్నప్పుడు క్రికెట్‌పై ఆసక్తి పెంచుకుంది.
సామాన్య కుటుంబం నుంచి వచ్చి క్రికెట్ ను తన కెరీర్ గ ఎంచుకునే క్రమంలో ఆమెకు చాలా కష్టాలు ఎదురయ్యాయి. కానీ ఎప్పుడూ కూడా క్రికెట్ పట్ల ఆమె తనకున్న ఆసక్తిని కోల్పోలేదు. పాఠశాలలో ఉన్నప్పుడే ఆశా.. తన తల్లిదండ్రులకు తెలియజేయకుండా జిల్లా స్థాయిలో క్రికెట్ టోర్నీలు ఆడేది. 14 సంవత్సరాల చిన్న వయస్సులో సీనియర్ స్థాయిలో కేరళ రాష్ట్ర జట్టు తరపున ఆడింది.
షేన్ వార్న్ కోచ్.. టెర్రీ జెన్నర్.. ఆమెకు 15 సంవత్సరాల వయస్సులో MAC స్పిన్ ఫౌండేషన్‌లో శిక్షణ ఇస్తున్నప్పుడు ఆమె ప్రతిభను గుర్తించాడు. 19 సంవత్సరాల వయస్సులో ఆశా శోభన.. కేరళ తరపున సీనియర్ మహిళల T20 ఛాలెంజర్‌గా ఆడింది. 2011-12 సీజన్‌లో ఆమె కెరీర్ లో మరింత ముందుకు దూసుకెళ్లింది. ఐదు మ్యాచ్‌లలో 10 వికెట్లు, రెండు అర్ధ సెంచరీలు చేసి డబ్ల్యూపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో స్థానం సంపాదించింది.
Fifer by an RCB bowler that too in Chinnaswamy.
— Johns (@JohnyBravo183) February 24, 2024
Take a bow Sobhana Asha 🫡#WPL2024
pic.twitter.com/klIJx7yrmJ