లెప్రసీ సర్వే కోసం వెళ్లిన... ఆశ కార్యకర్తకు గుండెపోటు

పానగల్, వెలుగు: లెప్రసీ సర్వే కోసం వెళ్లిన ఆశ కార్యకర్త గుండెపోటుతో చనిపోయింది. పానగల్ మండలం కదిరేపాడు గ్రామానికి చెందిన ఆశా కార్యకర్త పగడాల జయమ్మ(52) సర్వే చేస్తుండగా, ఛాతీలో నొప్పి వచ్చింది. ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులకు ఈ విషయం చెప్పేలోగా కుప్పకూలింది. 

ALSO READ : జగిత్యాలలో పోలీసుల కార్టన్​సెర్చ్​

ఆమెకు భర్త నారాయణ, ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. ఎంపీటీసీ వీరపాగ నాగమ్మ, సీఐటీయూ జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, సీపీఎం మండల కార్యదర్శి దేవేందర్  ఆమెకు నివాళులు అర్పించారు. జయమ్మ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్​ చేశారు. పని భారంతో ఆశా కార్యకర్తలు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని పేర్కొన్నారు. జయమ్మ కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్​గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.