ఎమ్మెల్యే విద్యాసాగర్‌‌‌‌‌‌‌‌ను అడ్డుకునే యత్నం : ఆశావర్కర్లు, మిడ్‌‌‌‌ డే మీల్స్ ​కార్మికులు

మల్లాపూర్ , వెలుగు: మల్లాపూర్​మండలకేంద్రంలో కోరుట్ల ఎమ్మెల్యే కె. విద్యాసాగర్‌‌‌‌‌‌‌‌రావును అడ్డుకునేందుకు ఆశావర్కర్లు, మిడ్‌‌‌‌ డే మీల్స్​కార్మికులు ప్రయత్నించారు. శనివారం మల్లాపూర్​ఎంపీడీవో ఆఫీస్‌‌‌‌లో బతుకమ్మ చీరల పంపిణీకి ఎమ్మెల్యే హాజరయ్యారు.

ఈ సందర్భంగా పలువురు కార్మికులు అక్కడికి చేరుకొని తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​చేస్తూ ఎంపీడీవో ఆఫీస్‌‌‌‌ ముందు బైఠాయించారు. అనంతరం ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు.  ఎస్సై నవీన్ కుమార్ వారిని అడ్డుకొని ఆశావర్కర్లు, మిడ్‌‌‌‌డే మీల్స్​కార్మికులతో మాట్లాడారు.