
బెల్లంపల్లి, వెలుగు: లాఠీచార్జీలో గాయపడిన ఆశా వర్కర్లకు ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలని బెల్లంపల్లిలో ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు. మంగళవారం అంబేద్కర్ చౌరస్తాలో సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. మండల కన్వీనర్ చల్లూరి దేవదాస్ మాట్లాడుతూ.. చలో హైదరాబాద్కు బయలుదేరిన ఆశా వర్కర్లపై పోలీసుల లాఠీ చార్జీని తీవ్రంగా ఖండించారు.
ప్రభుత్వం గతంలో ఫిక్స్డ్ వేతనం, పీఎఫ్, ఈఎస్ఐ, రిటైర్మెంట్ ప్రయోజనాలు కల్పిస్తామని హామీ ఇచ్చిందని, కానీ ఇప్పటికీ సమస్యలు పరిష్కరించలేదన్నారు. ఆశాల వేతనాన్ని రూ.18వేలకు పెంచడంతోపాటు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.