సికింద్రాబాద్, వెలుగు: తమకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంటిని ముట్టడించారు. మంగళవారం సికింద్రాబాద్ మారేడ్ పల్లిలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంటికి వెళ్లి వినతిపత్రం ఇచ్చేందుకు వారు ప్రయత్నించగా ఆయన అప్పటికే బయటకు వెళ్లిపోయారు.
ALSO READ :మిషన్ భగీరథ ప్లాంట్ ను సందర్శించిన .. యూనిసెఫ్ బృందం
దీంతో ఆశా వర్కర్లు మంత్రి ఇంట్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అరెస్టు చేసి మారేడ్ పల్లి పీఎస్ కు తరలించారు. మంత్రి కనీసం తమ గురించి పట్టించుకోకపోవడం దారుణమని ఆశా వర్కర్లు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం వెంటనే తమకు జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు.