కరీంనగర్లో ఆశావర్కర్ల 48 గంటల ఆందోళన

కరీంనగర్ జిల్లాలో ఆశావర్కర్లు ఆందోళన చేపట్టారు. జిల్లా నలుమూలల అన్ని మండలాల నుంచి తరలివచ్చిన వందలాది మంది ఆశావర్కర్లు కలెక్టరేట్ ముందు 48 గంటల ధర్నా నిర్వహిస్తున్నారు. తమతో అదనపు పనులు చేయిస్తున్నారని ఆశా వర్కర్లు  ఆరోపించారు.

పనిచేయడానికి వ్యతిరేకం కాదని.. అయితే అదనపు పనులకు తగినట్లుగా వేతనాలు ఇవ్వాలని ఆశావర్కర్లు  డిమాండ్ చేశారు. 16 నెలల కరోనా రిస్క్ అలవెన్స్ బకాయిలు ఇవ్వలేదని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే గతంలో చేసిన కంటివెలుగు, లెప్రసీ సర్వేలకు సంబంధించిన వేతనాలను ఇంత వరకు చెల్లించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. బకాయిలు ఇవ్వకుండా.. పని ఒత్తిడి పెంచుతూ వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. బకాయిలు చెల్లిస్తేనే కంటి వెలుగుతోపాటు ఇతర సర్వేలలో పాల్గొంటామని ఆశావర్కర్లు చెప్పారు.