కామారెడ్డి టౌన్, వెలుగు : సమస్యలు పరిష్కరించాలని డిమాండ్చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆశా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. జిల్లా కేంద్రంలోని మెయిన్రోడ్లపై ర్యాలీగా కలెక్టరేట్ కు వెళుతుండగా.. వారిని ధర్నా చౌక్వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడే కొద్దిసేపు ధర్నా చేశారు. గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా ఉద్యోగ భద్రత కల్పించాలని
ప్రతి నెలా రూ.18వేల జీతం ఇవ్వాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్చేశారు. అనంతరం కలెక్టరేట్ఏవోకు వినతి పత్రం అందించారు. సీఐటీయూ లీడర్ రవీందర్, ఆశాకార్యకర్తల యూనియన్ప్రతినిధులు ఇందిర, రాజశ్రీ, పల్లవి, మంజుల, విజయ, పుష్ఫ, పద్మ తదితరులు పాల్గొన్నారు.