నాగర్ కర్నూల్ లో ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీస్​ ముట్టడి

నాగర్ కర్నూల్ లో ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీస్​ ముట్టడి

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : తమ సమస్యలు పరిష్కరించాలని ఆశా వర్కర్లు మంగళవారం ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీస్​ను ముట్టడించారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్స్  యూనియన్  గౌరవ అధ్యక్షుడు వి పర్వతాలు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పని చేస్తున్నా సరైన వేతనాలు ఇవ్వకుండా శ్రమ దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. కళావతి, దేవి, శశికళ, శివలీల, చెన్నమ్మ, సువర్ణ పాల్గొన్నారు.

అలంపూర్ : సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆశా వర్కర్లు ఎమ్మెల్యే అబ్రహంకు వినతిపత్రం అందజేశారు. సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారం కోసం కృషి చేయాలని కోరారు. ఆశా వర్కర్ల ఆందోళనకు బీఎస్పీ నాయకులు మద్దతు తెలిపారు. బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు కేశవరావు, ఆశా వర్కర్లు స్వప్న, అమ్ములమ్మ, బీసమ్మ, సంతోషమ్మ, రేణుక, కృష్ణవేణి, నాగలక్ష్మి, సునీత, భారతి పాల్గొన్నారు.

భూత్పూర్ : నియోజకవర్గంలోని ఆశా వర్కర్లు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డికి సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. ఆశా కార్యకర్తల సమస్యలను మంత్రి హరీశ్​రావు దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి, నిక్సన్, యాదమ్మ, అనురాధ, మంజుల, పద్మ, మమత, గౌరి, శశికళ, శ్రీదేవి పాల్గొన్నారు

హన్వాడ : తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ మండల కేంద్రానికి వచ్చిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు ఆశా కార్యకర్తలు వినతిపత్రం అందజేశారు. కనీస వేతనంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. మంత్రి స్పందిస్తూ సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.