కరీంనగర్ టౌన్, వెలుగు: కలెక్టరేట్ ఎదుట ఆశా వర్కర్లు మహాధర్నా నిర్వహించారు. గురువారం సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేశ్ మాట్లాడుతూ ఆశా సమస్యల పరిష్కారమయ్యే వరకు సమ్మె ఉధృతం చేస్తామన్నారు. ఆశా కార్యకర్తలకు ఫిక్స్డ్ వేతనం రూ.18వేలు,ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
రాజన్నసిరిసిల్ల: తమ డిమాండ్లు పరిష్కరించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు గురువారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. రెండు గంటలపాటు కలెక్టరేట్ ముందు నిరసన తెలిపారు. సీఐటీయూ లీడర్కోడం రమణ మాట్లాడుతూ 11 రోజులుగా ఆశాలు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకుంటలేదన్నారు. అనంతరం అడిషనల్కలెక్టర్ఖీమ్యానాయక్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో లీడర్లు రమేశ్, నాగరాజు, పద్మ, మహేశ్, మంజుల , జయశీల, భారతి, కస్తూరి, రాణి తదితరులు పాల్గొన్నారు.
జగిత్యాల టౌన్ : తమ సమస్యలు పరిష్కరించాలని గురువారం ఆశా వర్కర్లు జగిత్యాల కలెక్టరేట్ముట్టడికి యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో బైఠాయించి నిరసన తెలిపారు. సీఐటీయూ జిల్లా కన్వీనర్ సులోచన మాట్లాడుతూ అనేక సంక్షేమ పథకాల నిర్వహణలో పాలుపంచుకుంటున్న ఆశావర్కర్లను సర్కార్ చిన్నచూపు చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.