దొరికిపోయాడు: కిండ పడిన చూయింగ్ గమ్.. మళ్లీ నోట్లో వేసుకున్న క్రికెటర్

దొరికిపోయాడు: కిండ పడిన చూయింగ్ గమ్.. మళ్లీ నోట్లో వేసుకున్న క్రికెటర్

ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ ఓ చెత్త పనితో వార్తల్లోకెక్కాడు. ఇంతకీ అతనేం చేశాడంటారా? చిన్నపిల్లల్లా కింద పడ్డ చూయింగ్ గమ్‌ని తిరిగి నోట్లో వేసుకున్నాడు. లార్డ్స్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఈ ఘటన చోటుచేసుకుంది. దీన్ని చూసిన నెటిజన్స్.. 'ఛీ ఛీ ఇదేం పాడు పని' అంటూ అతన్ని ఆటాడుకుంటున్నారు.

రెండో టెస్టులో లబుషేన్ తన గ్లోవ్స్‌ను సరి చేసుకుంటుండగా చూయింగ్ గమ్ నోటి నుంచి జారిపోయింది. ఆపై మరొకటి తెప్పించుకోవాలంటే టైమ్ పడుతుంది అనుకున్నాడో ఏమో.. క్షణం ఆలోచించకుండా కింద పడిన దానిని చేతికందుకొని తిరిగి నోట్లో వేసుకున్నాడు. దానికి మట్టి ఏమైనా అంటుకుందా? బాగానే ఉందా? అన్నది కూడా చూసుకోలేదు. దానిని మళ్లీ నములుకుంటూ గ్లోవ్స్ సరి చేసుకున్నాడు. ఇదే ఒక చెత్త పని అంటే.. ఈ అద్భుత దృశ్యాలను కెమెరామెన్‌లు చిత్రీకరించడం మరో చెత్త పని. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Watch Marnus Labuschagne picking the chewing gum and eating it back after it slipped on the ground from his mouth, in the latest Ashes development.#TheAshes #ENGvsAUSpic.twitter.com/PzH1rpEaWN

— Himanshu Pareek (@Sports_Himanshu) June 29, 2023