IPL 2025: గుజరాత్ జట్టును వీడనున్న నెహ్రా.. రేస్‌లో యువరాజ్ సింగ్

IPL 2025: గుజరాత్ జట్టును వీడనున్న నెహ్రా.. రేస్‌లో యువరాజ్ సింగ్

ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ జట్టు నుంచి హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా తప్పుకోనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అతనితో పాటు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ విక్రమ్ సోలంకీలు గుజరాత్ కు గుడ్ బై చెప్పే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఫ్రాంచైజీ వీరిని తప్పిస్తుందో లేకపోతే వీరు స్వతహాగా తప్పుకుంటున్నారో తెలియాల్సి ఉంది. ఒకవేళ నెహ్రా హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకంటే టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ రేస్ లో ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. 

యువరాజ్ సింగ్ కోసం ఇప్పటికే గుజరాత్ ఫ్రాంచైజీలు సంప్రదింపులు జరిపారట. ఇందుకు యువీ సైతం ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా గిల్ జట్టును నడిపిస్తున్నాడు. యువరాజ్ సింగ్ కు గిల్ కు మధ్య మంచి సమన్వయము ఉంది. ఇద్దరూ పంజాబ్ కి చెందినవారే కావడం విశేషం. దీంతో యువరాజ్ రాక దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. తొలి రెండు సీజన్ లు హార్దిక్ పాండ్య గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా ఉన్నాడు. పాండ్య ముంబై ఇండియన్స్ కు వెళ్లిపోవడంతో యువ బ్యాటర్ గిల్ కు కెప్టెన్సీని అప్పజెప్పారు.

ALSO READ | Mohammed Shami: మహమ్మద్ షమీ పూర్తి ఫిట్.. రీ ఎంట్రీకి అంతా సిద్ధం

ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ 2022లో అరంగేట్రం చేసింది. తమ తొలి సీజన్ లోనే ట్రోఫీ గెలుచుకుని అన్ని జట్లకు షాక్ ఇచ్చింది. 2023 లోనూ రన్నరప్ గా నిలిచి ఐపీఎల్ లో పటిష్టమైన జట్లలో ఒకటిగా పేరు తెచ్చుకుంది. ఈ విజయాలకు అశిష్ నెహ్రా కోచింగ్‌ కీలక పాత్ర పోషించింది. బౌండరీ దగ్గర నించొని ఆటగాళ్లకు సలహాలు ఇస్తూ గుజరాత్ జట్టును ముందుండి నడిపించాడు. అయితే ఇటీవలే ముగిసిన 2024 సీజన్ లో నెహ్రా ఆ మ్యాజిక్ చూపించలేకపోయారు. ఈ సీజన్ లో గుజరాత్ ప్లే ఆఫ్ కు చేరలేకపోయింది.