Dil Raju 60th Movie: దిల్ రాజు నిర్మాతగా ఓల్డ్ సిటీ బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌లో కొత్త చిత్రం..హీరో ఎవరంటే?

Dil Raju 60th Movie: దిల్ రాజు నిర్మాతగా ఓల్డ్ సిటీ బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌లో కొత్త చిత్రం..హీరో ఎవరంటే?

రౌడీ బాయ్స్, లవ్ మీ చిత్రాలతో  హీరోగా ఆకట్టుకున్న ఆశిష్.. కొత్త ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బుధవారం తన న్యూ మూవీని అనౌన్స్ చేశారు.  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై  నిర్మాతలు  దిల్ రాజు, శిరీష్  తమ 60వ ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌గా ఈ చిత్రాన్ని ప్రకటించారు. 

ఈ సినిమాతో  ఆదిత్యరావు గంగాసాని దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. హైదరాబాద్ ఓల్డ్ సిటీ బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌లో ఈ చిత్రం తెరకెక్కనుందని, ఆశిష్​ లోకల్ బాయ్‌‌‌‌‌‌‌‌గా కనిపించనున్నాడని మేకర్స్ తెలియజేశారు.  ఈ చిత్రం కోసం ఆశిష్ ఇంటెన్స్, మాస్ ఓరియెంటెడ్ లుక్‌‌‌‌‌‌‌‌లో కంప్లీట్ మేకోవర్ అవుతున్నాడు. 

అలాగే ఇందులో నటించడానికి  న్యూ ట్యాలెంట్ కోసం ముఖ్యంగా హైదరాబాద్ యాసని ఫ్లూయంట్‌‌‌‌‌‌‌‌గా మాట్లాడే వారి కోసం కాస్టింగ్ కాల్‌‌‌‌‌‌‌‌ని అనౌన్స్ చేశారు.