
హనుమకొండ/పరకాల, వెలుగు : భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాలకు చెందిన మాజీ మావోయిస్ట్ గాజర్ల అశోక్ అలియాస్ ఐతు కాంగ్రెస్‌లో చేరారు. గురువారం హైదరాబాద్‌లో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. 1994లో మావోయిస్టుల్లో చేరిన అశోక్ దండ కారణ్య స్పెషల్ జోన్ కమిటీ మెంబర్‌గా పనిచేశారు. అనారోగ్య కారణాలతో 2016లో జనజీవన స్రవంతిలో కలిశారు. పరకాల నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలన్న ఉద్దేశంతోనే ఆయన కాంగ్రెస్‌లో చేరినట్లు తెలుస్తోంది.