
నర్సాపూర్ : మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ గా ఒకటో వార్డ్ కౌన్సిలర్ అశోక్ గౌడ్ ఎన్నికయ్యారు. ఇదివరకటి మున్సిపల్ చైర్మెన్ మురళీ యాదవ్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కొత్త చైర్మెన్ ను ఎన్నుకునేందుకు మున్సిపల్ ఆఫీసులో తూప్రాన్ ఆర్డీవో జయచంద్రా రెడ్డి ఆధ్వర్యంలో మీటింగ్ నిర్వహించారు. మీటింగ్ కు బీజేపీకి చెందిన ఆరుగురు కౌన్సిలర్లు గైర్హాజర్ అయ్యారు.
బీఆర్ఎస్ కు మెజారిటీగా 9 మంది కౌన్సిలర్లు ఉన్నారు. మొత్తం మున్సిపాలిటీలో 15 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఎక్స్ అఫిషియో సభ్యులైన నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత రెడ్డి, ఎమ్మెల్సీలు వెంకట్రాంరెడ్డి, యాదవరెడ్డి మద్దతు కూడా ఉంది. ఈ మేరకు ఒకటో వార్డు కౌన్సిలర్ అశోక్ గౌడ్ ఒక్కరే నామినేషన్ వేయడంతో చైర్మెన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.