కాంగ్రెస్ పార్టీకి మహారాష్ట్రాలో వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. రెండు రోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి బాబా సిద్దిక్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి NCP పార్టీలో చేరారు. జనవరిలో మాజీ ఎంపీ మిలింద్ దేవరా కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇలా కాంగ్రెస్ మహారాష్ట్రలో బలహీనమవుతున్నా క్రమంలో మరో పెద్ద నేత మాజీ ముఖ్య మంత్రి అశోక్ చవాన్ ఈరోజు తన రాజీనామా పత్రాన్ని స్పీకర్ కు సమర్పించారు. రాజీనామాకు గల కారణాలు అశోక్ వెల్లడించలేదు. త్వరలో ఆయన బీజేపీలో చేరుతున్నట్లు సమాచారం. 2008 నుంచి 2010 మధ్య కాలంలో ఆయన ముఖ్యమంత్రిగా పని చేశారు. 2014 నుండి 2019 వరకు మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (MPCC) అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు.