మురారి తరహాలో వాసుదేవ.. ఆసక్తిరేపుతున్న టీజర్

మురారి తరహాలో వాసుదేవ.. ఆసక్తిరేపుతున్న టీజర్

హీరోతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా(Ashok galla).. తన రెండో సినిమాగా దేవకీ నందన వాసుదేవ(Devaki Nandana Vasudeva)లో నటిస్తున్నాడు. గుణ 369 ఫేమ్ అర్జున్ జంధ్యాల(Arjun Jandhyala) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు ప్రశాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్మ కథను అందించాడు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు. నల్లపనేని యామిని సమర్పణలో సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్నారు. బుధవారం ఈ సినిమా టైటిల్‌‌‌‌‌‌‌‌ను రివీల్ చేయడంతో పాటు టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన ఈవెంట్‌‌‌‌‌‌‌‌లో హీరో అశోక్ గల్లా మాట్లాడుతూ ‘నాలుగు సినిమాల తర్వాత ఇలాంటి మాస్‌‌‌‌‌‌‌‌ సినిమా చేయాలనుకున్నా. కానీ నిర్మాత బాలకృష్ణ గారు రెండో చిత్రానికే నన్ను ఇలా ప్రజెంట్ చేసే అవకాశం ఇచ్చారు.

ప్రశాంత్ వర్మ అద్భుతమైన కథ ఇచ్చారు. అర్జున్ ఈ కథని నెక్స్ట్ లెవల్‌‌‌‌‌‌‌‌కి తీసుకెళ్ళారు’ అని చెప్పాడు. దర్శకుడు మాట్లాడుతూ ‘అన్ని కమర్షియల్ విలువలు ఉంటూనే కొత్తగా ఉండే సినిమా ఇది. ‘మురారి’ తరహాలో తప్పకుండా అందరికీ నచ్చుతుంది’ అని చెప్పాడు. కథను అందించిన ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ ‘నేను రాసిన కథల్లో మోస్ట్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనింగ్ స్టోరీ ఇది. దాదాపు రెండేళ్ళు దీనిపై వర్క్ చేశా. అర్జున్ ఈ కథని నాకంటే బాగా తీయగలరనే నమ్మకం కలిగింది. ఇది చాలా మాస్ ఫిల్మ్. క్లాస్‌‌‌‌‌‌‌‌గా ఉండే అశోక్ ఇంత మాస్ పాత్రని ఎలా చేస్తాడో అనుకున్నా కానీ చాలా సర్ ప్రైజ్ ఇచ్చాడు. సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అన్నాడు. ‘విజువల్ వండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉంటుందని నిర్మాత చెప్పారు. హీరోయిన్ మానస, మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్, రచయిత సాయి మాధవ్ బుర్రా 
తదితరులు పాల్గొన్నారు.