![విదేశాలకు విస్తరించనున్న అశోక్ లేలాండ్](https://static.v6velugu.com/uploads/2019/04/ashok.jpg)
న్యూఢిల్లీ: అంతర్జాతీయ విస్తరణలో భాగంగా కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్ (సీఐఎస్ )తో పాటు ఆఫ్రికా దేశాల్లోనూ మరిన్ని అసెంబ్లీ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని కమర్షియల్ వాహనాల కంపెనీ అశోక్ లేలాండ్ భావిస్తోంది. కొత్తగా అభివృద్ధి చేసినహెవీ, లైట్ కమర్షియల్ వెహికిల్స్ ద్వారా ఈ కొత్తమార్కెట్లలోకి ప్రవేశించడం సులువు అవుతుందని భావిస్తోంది. మిడిల్ ఈస్ట్, సార్క్, కొన్ని ఆఫ్రికాదేశాల్లో అశోక్ లేలాండ్ కు ఇప్పటికే గట్టిపట్టు ఉంది.వచ్చే ఏడాది నుంచి మీడియా, హెవీ వెహికిల్స్‌తయారు చేయడానికి మోడ్యులార్ ప్లాట్ ఫారాన్నిఅభివృద్ధి చేస్తోంది. ఈ మోడల్స్ తో కొత్త మార్కెట్లలోకి దూసుకెళ్లడం సులువని భావిస్తోంది. హిం దుజా గ్రూపునకు చెందిన అశోక్ లేలాండ్ చెన్నై కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.సీఐఎస్ దేశాల్లో అమ్మకాలు బాగున్నా యని, ఇక్కడభారీ ఖర్చుతో ప్లాంట్లు నిర్మించడం కంటే తక్కువ వ్యయంతో అసెంబ్లీ యూనిట్లు నిర్మించడం మేలనికంపెనీ చైర్మన్ ధీరజ్ హిందుజా చెప్పారు. ‘‘ఆఫ్రి-కాలోని ఐవరీ కోస్ట్, కెన్యా లో ఇలాంటి యూనిట్లుపెడతాం. సీఐఎస్ దేశాల్లో కొన్నింట్లో నూ మాఅసెంబ్లీ యూనిట్లు ఉంటాయి. స్థా నిక ప్లాంట్లతోనూకంపెనీలతో ఒప్పందాలు కుదుర్చు కునే అవకాశాలు ఉన్నాయి’’ అని అన్నారు. బాస్ , గురు మోడల్స్ ను ఆసియాన్ మార్కెట్లలోనూ అమ్ముతామని, కొత్తమోడల్స్ ద్వారా కొత్త మార్కెట్ల నుంచి భారీ ఆదాయం సంపాదిస్తామని హిందుజా చెప్పారు. అశోక్ లే లాండ్ ఏటా తన ప్రొడక్షన్ లో 12 శాతం వాహనాలను ఎగుమతి చేస్తోంది. కొత్త మోడల్స్ , కొత్త దేశాల్లో కిప్రవేశించడం ద్వారా ఎగుమతులు రాబోయే ఐదేళ్లలో 20 శాతానికి పెరుగుతాయని కంపెనీ అంచనావేస్తోంది.