సెకండ్‌ హ్యాండ్‌ బండ్ల కోసం అశోక్‌‌ లేలాండ్ ‘రీ–అల్‌‌’

సెకండ్‌ హ్యాండ్‌ బండ్ల కోసం అశోక్‌‌ లేలాండ్ ‘రీ–అల్‌‌’

సెకండ్‌ హ్యాండ్‌ బండ్ల కోసం అశోక్‌‌ లేలాండ్ ‘రీ–అల్‌‌’

న్యూఢిల్లీ : సెకండ్ హ్యాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమర్షియల్ వెహికల్స్‌‌‌‌‌‌‌‌ బిజినెస్‌‌‌‌‌‌‌‌లోకి ఎంట్రీ ఇచ్చిన అశోక్ లేలాండ్‌‌‌‌‌‌‌‌, ఇందుకోసం ఓ డిజిటల్‌‌‌‌‌‌‌‌ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌ను తీసుకొచ్చింది. ‘రీ–అల్‌‌‌‌‌‌‌‌’ పేరుతో ఈ–మార్కెట్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌ను లాంచ్ చేసింది.  కస్టమర్లు తమ పాత కమర్షియల్ వెహికల్స్‌‌‌‌‌‌‌‌ను ఈ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌లో ఎక్చేంజ్ చేసుకోవడం ద్వారా అశోక్ లేలాండ్ ఆఫర్ చేస్తున్న ట్రక్‌‌‌‌‌‌‌‌లు, బస్సులను కొనుక్కోవచ్చు.  యూజ్డ్ కమర్షియల్ వెహికల్ ఇండస్ట్రీ మరింతగా విస్తరించనుందని, డిజిటల్ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌ను వాడుకోవడం ద్వారా కస్టమర్లకు మెరుగైన సర్వీస్‌‌‌‌‌‌‌‌లను అందించడానికి తమకు బోలెడు అవకాశాలు ఉన్నాయని  అశోక్ లేలాండ్ ఎండీ, సీఈఓ శేను అగర్వాల్ అన్నారు.

ఒక పద్ధతంటూ లేకుండా ఉన్న యూజ్డ్ వెహికల్స్ ఇండస్ట్రీలో  పారదర్శకత తీసుకొస్తామని వెల్లడించారు. ‘రీ–అల్‌‌‌‌‌‌‌‌’ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్ కస్టమర్లకు అనేక ఫీచర్లను ఆఫర్ చేస్తోందని, వీరు తమకు నచ్చిన బండిని సంబంధిత డాక్యుమెంట్లతో పొందొచ్చని అన్నారు. కస్టమర్లు తమ పాత బండ్లను  అమ్ముకోవడానికి వీలుండడంతో  యూజ్డ్ వెహికల్స్ బిజినెస్‌‌‌‌‌‌‌‌ మరింత విస్తరిస్తుందని, దీనిపై ఎక్కువ ఫోకస్‌‌‌‌‌‌‌‌ పెట్టామని అశోక్ లేలాండ్ ప్రెసిడెంట్ (మీడియం, హెవీ కమర్షియల్ వెహికల్స్‌‌‌‌‌‌‌‌) అన్నారు.  కస్టమర్ల ఎక్స్‌‌‌‌‌‌‌‌పీరియెన్స్‌‌‌‌‌‌‌‌ను మరింతగా పెంచడానికి  తాము తీసుకొచ్చిన ఈ–మార్కెట్‌‌‌‌‌‌‌‌ప్లేస్ సాయపడుతుందని అభిప్రాయపడ్డారు. కస్టమర్లు తమ పాత బండ్లను ఎక్స్చేంజ్‌‌‌‌‌‌‌‌ చేసుకొని  కంపెనీ  ట్రక్కులు, బస్సులకు అప్‌గ్రేడ్ అవ్వొచ్చన్నారు.