హిందూజా గ్రూప్ ఫ్లాగ్షిప్ అశోక్ లేలాండ్ దేశీయ మార్కెట్లకు రెండు ట్రాక్టర్లను పరిచయం చేసింది. వీటిలో 41.5టీ జీసీడబ్ల్యూ గల ఏవీటీఆర్ 4220, 43.5టీ జీసీడబ్ల్యూ గల ఏవీటీఆర్ 4420 ట్రాక్టర్లు ఉన్నాయని సంస్థ తెలిపింది.ఈ లాంచ్‌తో అశోక్ లేలాండ్ 41.5టీ గ్రాస్ కాంబినేషన్ వెయిట్ (జీసీవాట్స్) తోపాటు 43.5టీ జీసీడబ్ల్యూతో టూ-యాక్సిల్ కాన్ఫిగరేషన్‌తో ట్రాక్టర్లను అందిస్తున్న మొదటి భారతీయ సంస్థగా అవతరించింది. ఇవి భారీ లోడ్లను మోయడానికి అనువుగా ఉంటాయని, మైలేజ్ బాగా వస్తుందని, టీసీఓ అడ్వాంటేజ్ ఉంటుందని అశోక్ లేలాండ్ హెడ్
( ఎంహెచ్) సీవీ సంజీవ్ కుమార్ తెలిపారు.