పిజ్జా 2, భద్రమ్ లాంటి డబ్బింగ్ మూవీస్తో తెలుగులో ఆకట్టుకున్న హీరో అశోక్ సెల్వన్ (Ashok Selvan). కలర్ ఫోటో ఫేమ్ చాందిని చౌదరితో పాటు మేఘా ఆకాష్తో కలిసి అశోక్ సెల్వన్ నటించిన రీసెంట్ మూవీ సబా నాయగన్. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ గతేడాది డిసెంబర్‌లో 22న థియేటర్లలో రిలీజైంది.
లేటెస్ట్గా సబా నాయగన్ (Saba Nayagan) మూవీ వాలెంటైన్స్ డే కానుకగా బుధవారం ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేశారు మేకర్స్.
అంతేకాదు డిస్నీప్లస్ హాట్ స్టార్‌లో ట్రెండింగ్ మూవీస్‌లో ఒకటిగా సబా నాయగన్ మూవీ నిలిచింది. డిఫరెంట్ టైమ్ పీరియడ్స్‌లో సాగే లవ్ స్టోరీగా డైరెక్టర్ సీఎస్ కార్తికేయన్ ఈ మూవీని తెరకెక్కించాడు. కాగా సబా నాయగన్ మూవీ చాందిని చౌదరి ఫస్ట్ తమిళ్ మూవీ కావడం విశేషం.
సబా నాయగన్ స్టోరీ:
తాగిన మత్తులో సబా (అశోక్ సెల్వన్) అనే యువకుడు న్యూసెన్స్ క్రియేట్ చేస్తాడు. ఇక అతడిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. లవ్ ఫెయిల్యూర్‌తోనే సబా పిచ్చి పిచ్చిగా ప్రవర్తించాడని పోలీస్ ఆఫీసర్ అర్థం చేసుకుని..అతడి లవ్ స్టోరీ గురించి అడుగుతాడు. సబా జీవితంలోకి వచ్చిన రియా,మేఘతో పాటు దీప్తి ఎవరు? ఈ ముగ్గురిలో సబా ఎవరిని ప్రేమించాడు అన్నదే సబా నాయగన్ స్టోరీ.
లవ్..ఎమోషన్..ఎంటర్ టైన్ మెంట్ తో డిఫరెంట్ టైమ్ పీరియడ్స్‌లో సాగే లవ్ స్టోరీగా డైరెక్టర్ సీఎస్ కార్తికేయన్ ఈ మూవీని తెరకెక్కించాడు. కాలేజీలో సబాను ప్రేమించే యువతిగా చాందిని చౌదరి కనిపించింది. లవ్ స్టోరీని స్వచ్ఛంగా స్క్రీన్‌పై ప్రజెంట్ చేసిన తీరుతో పాటు అశోక్ సెల్వన్, మేఘాకాష్, చాందిని చౌదరి యాక్టింగ్ అభిమానులను మెప్పించాయి. థియేటర్లలో ఈ మూవీ పదిహేను కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించింది.